Want create site? Find Free WordPress Themes and plugins.

క్షేత్రస్థాయిలో అసంతృప్తి

 

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం సిద్ధించినా.. తెలంగాణ ప్ర‌జ‌లు క‌ష్టాల్లో పుట్టి..క‌ష్టాల్లో పెరిగి.. చివ‌రికి క‌ష్టాల‌తోనే బ‌తుకులీడుస్తున్నారు. బంగారు తెలంగాణ అంటూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేస్తున్న వంచ‌న‌తో ప్ర‌జ‌లు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. ఓట్లు, సీట్లే ల‌క్ష్యంగా అడుగులేస్తూ.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల జీవితాల‌తో చెల‌గాట‌మాడుతూ వ‌స్తోంది. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల తరబడి ప్రజలను వంచిస్తే… కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజలను దగా చేస్తున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు… బాసటగా నిలిచేందుకు మీ దగ్గరకు ప్రజా చైతన్య యాత్రతో వ‌చ్చినాము.

ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజా బలం లేని కేసీఆర్ విపక్ష పార్టీల నేతల్ని తమ పార్టీలోకి తీసుకొని 2019 ఎన్నికల్లో విజయం సాధించాలని కుట్రలు చేస్తున్నారు. ముందస్తుకు సై అంటూనే.. ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధిస్తానంటున్నారు. వందకు వంద శాతం వంద సీట్లు సాధిస్తానంటున్నారు. పైకి ఎంత మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శించిన‌ప్ప‌టికీ లోప‌ల మాత్రం ఏదో భయం, గుబులు. తెలంగాణ ప్రజలు తన మోసాల‌ను గమనిస్తారన్న…వ‌ణుకు. అలా ప్ర‌జ‌లు గ‌మ‌నించ‌కుండా ఉండ‌టం కోసం, ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించ‌డం కోస‌మే సీఎం కేసీఆర్ కొత్త‌ పథకాలు తెచ్చారు. అయినప్పటికీ నమ్మకం కుదిరిన‌ట్లు లేదు. ఎన్నికల్లో గెలుపుపై అపనమ్మకం కేసీఆర్ ను వెంటాడుతూనే ఉంది. అందుకే ఇతర పార్టీల నాయకులను గులాబీ పార్టీలోకి ఫిరాయించేలా కుటిలయత్నాలు కొన‌సాగిస్తున్నారు. 6 దశాబ్దాల కల నెరవేరిన సమయంలో తెలంగాణ ప్రజానీకం కష్టాలు నెరవేరుతాయని కోటి కలలతో ఉంది. ఆ క‌ల‌ల‌న్నీ చివ‌రికి క‌ల‌లుగానే మిగిలాయి. కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో తెలంగాణ సమాజం నట్టేట మునిగింది. అసలు రోగానికి మందు కాకుండా… పైపూత మందుతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారు.

ఈ మోసాలు ఇంకా సాగ‌వంటూ.. ఈ ద‌గా ఇంకానా అంటూ.. ఇవాళ బిజెపి ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌ప‌రిచే కార్యాన్ని భుజ‌స్కంధాల‌పై వేసుకుంది. ఈ యాత్ర‌లో అనేక మంది ప్ర‌జ‌లు త‌మ క‌ష్టాలను చెప్పుకున్నారు. స‌బ్బండ వ‌ర్ణాల ప్ర‌జ‌లు.. త‌మ ఇబ్బందుల గోడు వెల్ల‌బోసుకున్నారు. తీయ‌ని మాట‌ల గారడితో.. అర‌చేతిలో వైకుంఠం చూపించిన కేసీఆర్ నిజ‌స్వ‌రూపాన్ని మాతో చెబుతూనే..వివిధ వ‌ర్గాల‌ప్ర‌జానీకం క‌న్నీళ్ల‌ ప‌ర్యంత‌మైన సంఘ‌టన‌లు ఎన్నో..ఎన్నెన్నో.

ఈ ప్రజా కంటక పాలన నుంచి విముక్తి పొందేందుకు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలకండి. కేసీఆర్ సర్కారుపై జనంలో ఎంతో వ్యతిరేకత ఉంది. తెలంగాణలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన బిజెపి… వచ్చే ఎన్నికల్లో ప్రజలను తీర్పు కోరుతోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులను తీసుకురావడమే కాక… గ్రామాల్లో స్వరాజ్యం సిద్ధించేందుకు ఎంతగానో బిజెపి పాటుపడుతోంది. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రంలోని ఒక్కో గ్రామంపచాయతీకి నిధుల వరద పారించింది. మేజర్ పంచాయతీలకు కోటి, కోటిన్నర రూపాయల మేర నిధులొస్తే ఒక మోస్తరు పంచాయతీకి సైతం భారీగా నిధులు పొందగలగడం గతంలో ఎప్పుడైనా జరిగిందా… ? పెద్ద ఎత్తున నిధులొస్తే.. కేసీఆర్ సర్కారు… గ్రామ పంచాయతీల నుంచి రావాల్సిన నిధులను రాష్ట్ర ఖజానాకు బదిలీ చేసుకొంది. వెరసి గ్రామ స్వరాజ్యం స్వప్నాన్ని కాలరాసింది. వచ్చే ఎన్నికల్లో మార్పు నినాదంతో అడుగులు వేస్తున్నాం. కాంగ్రెస్, టీఆర్ఎస్ అవలంభిస్తున్న విధానాలను ఎండగట్టి ప్రజలను జాగృతం చేయడమే లక్ష్యంగా ప్రజా చైతన్య యాత్రను నిర్వహిస్తున్నాం. బీజేపీకి ప్రజల్నుంచి అపూర్వ మద్దతు లభిస్తోంది. అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ సర్కారుతో విసిగిపోయారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని మరోసారి నమ్మబోమంటూ తేల్చిచెబుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ప్ర‌త్యామ్నాయ‌ శక్తిగా బిజెపి ఆవిర్భవిస్తోంది. ఇందుకోసం నిరంతరం కార్యాచరణతో జనంలో ఉండాలని పార్టీ భావించే..యాదగిరి లక్ష్మీనర్సింహ స్వామి ఆశీస్సుల‌తో యాదాద్రి, భువనగిరి జిల్లా నుంచి ప్రారంభమైన ప్రజా చైతన్య యాత్ర ఈ నెల ఆరు వ‌ర‌కు సాగింది. ప్రజలకు ధైర్యాన్నివ్వడంతోపాటు, భవిష్యత్ పై నమ్మకం కలిగించడమే యాత్ర ఉద్దేశం నెర‌వేరింద‌న్న‌ది సుస్ప‌ష్టం. 23న ప్రారంభమైన జన చైతన్య యాత్ర రాష్ట్రంలోని 31 జిల్లాల్లో విడతల వారీగా నిర్వహించేందుకు పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ మొద‌టి విడ‌త యాత్ర‌. యాదాద్రిలో ప్రారంభమైన యాత్ర నల్గొండ, రంగారెడ్డి జిల్లాల మీదుగా మహబూబ్‌న‌గ‌ర్ , మేడ్చ‌ల్‌, కామ‌రెడ్డి, జ‌గిత్యాల‌, మంచిర్యాల‌, ప‌ర‌కాల, తుంగ‌తుర్తి ఇలా ఎక్క‌డికి  వెళ్లినా ఒకటే మాట… కేసీఆర్ ను నమ్మి మోసబోయాం… కల్లబొల్లి మాటలతో కాలం గడిపేస్తున్నారు. మా జీవితాల్లో మార్పు లేదన్న మాటే విన్పించింది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సర్కారు బుద్ధి చెప్తామంటూ ప్రజాగణంగా గొంతు విప్పింది.

జన చైతన్య యాత్రలో ప్రభుత్వ తీరుపై ప్రజలకు సవివరంగా వివరించాం. నిరుద్యోగులు తీవ్రంగా రగిలిపోతున్నారు… వారందరి ఆకాంక్షలు తీర్చాలంటే అది బీజేపీతోనే సాధ్యమవుతుందన్న అభిప్రాయాన్ని కలిగించాం. కేసీఆర్ చెప్పేదేదీ చేయరని… మాటలు తప్ప.. చేతలుండవని.. కేవలం పబ్లిసిటీతోనే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తున్నారన్న విషయాన్ని ప్ర‌జ‌లు అర్థం చేసుకుంటున్నారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏవిధంగా నెరవేర్చలేదో విడమర్చి చెప్తుంటే ప్రజల్నుంచి అపూర్వ స్పందన లభించింది.మేధావులు, విద్యార్థులు, రైతుల్లో తీవ్ర అసంతృప్తి కన్పించింది. డబుల్ బెడ్ రూమ్ పేరుతో ఇచ్చిన హామీని రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ నిలబెట్టుకోలేకపోయారు. డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాలపై బహిరంగ చర్చకు టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేస్తున్నాం.

నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరు చేసిన తెలంగాణ జనాన్ని నాలుగేళ్లలో కేసీఆర్ వంచించారు. కుటుంబ సంక్షేమానికే పరిమితమైపోయారు. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్… దళితుడికి ఉపముఖ్యమంత్రి పదవిచ్చి ముణ్ణాళ్ల ముచ్చట చేసిన విషయాన్ని తెలంగాణ దళితులెవరూ మర్చిపోలేరు. మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్… ఆచరణలో వందకు వంద శాతం విఫలమయ్యారు. కోటి ఆకాంక్షలతో ఓట్లేసి గెలిపించిన ప్రజలను కేసీఆర్ నట్టేట ముంచారు. 2019 ఎన్నికల్లో కారు పార్టీకి జనం బుద్ధి చెప్పాలి. కేసీఆర్ పాలనతో ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు. ఉద్యమ సమయంలో ప్రాణాలు లెక్కచేయకుండా పోరాడిన వారి ఉసురు కేసీఆర్ కు తగులుతుంది. ఆ కుటుంబాల త్యాగాలతో అధికారంలోకి వచ్చి… ఇప్పుడు వారిని అనాధలు చేశారు.

తెలంగాణలో నాలుగేళ్లు జనాలను అష్టకష్టాలు పెట్టిన కేసీఆర్… కుటుంబ సభ్యులకు మాత్రం… నాలుగేళ్లలో ఇంటికో ఉద్యోగం ఇప్పించుకున్నారు. రేపు మాపంటూ ఉద్యోగాల పేరుతో విద్యార్థులను మోసం చేస్తున్నారు. నాలుగేళ్లుగా ప్రజల బాధలు పట్టని కేసీఆర్… ఈ సంవత్సరం మభ్యపెట్టేందుకు కొత్త నాటకాలాడుతున్నారు. అందులో భాగమే రైతు బంధు పథకం. అది కూడా వ్యవసాయం చేసే రైతులకు ఎంత మాత్రం మేలు కలిగించడం లేదు.  కమలం పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు పూర్తి విశ్వాసం కలిగే చర్యలకు ఆస్కారముంటుందన్నది బిజెపి పాలిత రాష్ట్రాలను చూస్తే అర్థమవుతుంది.

కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణకు కేవలం అప్పులు మాత్రమే మిగిలాయి.  ధనిక రాష్ట్రమంటూ దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రజలనూ మోసగిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు సుమారు రూ. 60 వేల కోట్లు మాత్రమే తెలంగాణ అప్పులుంటే… అవి మూడు రెట్లు పెరిగి రూ. లక్షా 80 వేల కోట్లకు పైగా చేరాయి. తెలంగాణలోని ప్రతి పౌరుడు సుమారు 60 వేల రూపాయల భారాన్ని మోస్తున్నారు. కేసీఆర్ సర్కారును ఈ ఎన్నికల్లో ఆపకుంటే అది వచ్చే రోజుల్లో మరింత తీవ్రమవుతుందన్నది ప్రజలు గమనించాలి.

కేవలం ప్రచారంలో మాత్రం సంక్షేమం కన్పిస్తోంది త‌ప్ప‌…ప్రజలకు మాత్రం మిగిలింది సంక్షోభమే. గిట్టుబాటు ధర అడిగిన పాపానికి రైతులకు బేడేలేశారు… మరోసారి కేసీఆర్ కు అధికారమిస్తే… ఇక అంతే సంగతులన్న భావనకు ప్రజలు వచ్చారు. ప్రజల బాధలు చెప్పుకునేందుకు ఉన్న ధర్నా చౌక్ ను సైతం ఎత్తేసి నిరంకుశత్వానికి నిదర్శనంగా కేసీఆర్ పాలన సాగుతోంది.రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తోంది… సింగిల్ విండో కరప్షన్ కేంద్రంగా ప్రగతి భవన్ మారిపోయింది. వేల కోట్ల రూపాయల వెనకేసుకునే ప్రాజెక్టులకు మాత్రమే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నారు… ఇసుక మాఫియాకు టీఆర్ఎస్ ప్రభుత్వం కొమ్ముకాస్తోంది. ప్రాజెక్టుల పేరుతో అవినీతి పారుతోంది…  మిషన్ భగరీథ నల్లాల్లో కమీషన్లు వస్తున్నాయి… భజనగణం పాలకులై… ప్రజలు ప్రేక్షకులుగా మిగిలి… కష్టాలు కన్నీళ్లు దిగమింగుతున్నారు. నాడు ఉద్యమానికి దన్నుగా నిలిచిన బహుజన దళిత సంఘాలన్నీ ఇప్పుడు ఎంతో గోస అనభవిస్తున్నాయి. సీఎం అపాయింట్మెంట్ సైతం లభించడం లేదంటూ నాటి ఉద్యమ వీరులు వాపోతున్నారు.  కోదండరామ్, మంద కృష్ణ లాంటి నేతలు ప్రకటనలు ఇందుకు నిదర్శనం. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో పడరాని పాట్లు పడితే… కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో ప్రత్యక్ష నరకం చూస్తున్నారు.

మరోవైపు కుటుంబ పాలన, రాచరికం, నియంతృత్వం కాంగ్రెస్ పార్టీకి పర్యాయ పదాలుగా మారాయ్. సిద్ధాంతాలు విడిచి, విభేదాలు మరచి అవినీతిపరులంతా ఒక్కచోట చేరుతున్నారు… కేవలం బిజెపి గద్దెనెక్కుకుండా చేయాలన్న కుట్రలు కర్ణాటకలో మనం కళ్లారా చూశాం. కర్ణాటకలో చావుదప్పి కన్నులొట్టబోయిన కాంగ్రెస్ పార్టీ… అప్పటి వరకు ప్రత్యర్థిగా ఉన్న జేడీఎస్ తో  అవగాహన కుదుర్చుకోవడం… సిగ్గులేని రాజకీయాలకు పరాకాష్ట. విపక్షాల లక్ష్యం ఒక్కటే. ఏం చేసైనా స‌రే… కేంద్రంలో బిజెపి సర్కారును మరోసారి అధికారంలోకి రాకుండే చేయల‌న్న‌దే. ప్రజల కోసం సుస్థిర పాలన అందిస్తున్న అభినవ సర్దార్ నరేంద్ర మోదీపై నీతిమాలిన రాజకీయం పొత్తు పేరుతో రంకెలేస్తున్నాయి.  మోదీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఒక్కటై పావులు కదుపుతున్నాయి. అయితే  వీరి ఆటలేవీ సాగబోవు.  అన్ని పార్టీలు కాంగ్రెస్ తాను ముక్కలేనని స్వాతంత్ర్యం తర్వాత పరిణామాలు రుజవు చేస్తున్నాయి.  కాంగ్రెస్ కు వ్యతిరేకంగా దశబ్దాలు పోరాడిన కమ్యూనిస్టులు రాహుల్ భజన చేస్తుంటే… కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన టిడిపి ఆ పార్టీ గూటికి చేరుతున్నాయి. దేశాన్ని రెండు ముక్కలు చేయాలని చూసే విభజన రాజకీయాలకు ఏపీ సీఎం చంద్రబాబు మద్దతివ్వడం శోచనీయం. ఎవరెన్ని కుప్పిగంతులేసినా… ప్రధాని మోదీ ముందు వారి ఆటలు సాగబోవు.

కాంగ్రెస్ అంటేనే మోసం….  కాంగ్రెస్ అంటేనే వంచన….  కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలు….  కాంగ్రెస్ అంటేనే అవకాశవాదమన్నది ప్రజా చైతన్య యాత్రలో ప్రజల దృష్టిలోకి తీసుకెళ్లాము. తెలంగాణలో టీఆర్ఎస్ తో ఢీకొనే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని చాటిచెప్పాం. ఓవైపు టీఆర్ఎస్ పార్టీని మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయాల కోసం వాడుకుంటే… ఇప్పుడు అదే స్వార్థంతో కేసీఆర్ మజ్లిస్ పార్టీని చేరదీస్తున్నారు. మైనార్టీలకు రిజర్వేషన్ల పేరుతో టోపీ పెడుతున్నారు.

2014 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీ మేర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ 14 పంట‌ల‌కు మ‌ద్ధ‌తు ద‌ర క‌ల్పించి మాట నిల‌బెట్టుకున్నారు. ప్ర‌ధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో రాష్ట్రంలో రైతంగానికి మంచి ఊర‌ట ల‌భించిన‌ట్లయింది. దీంతో వ్య‌వ‌సాయం దండ‌గ కాదు.. వ్య‌వ‌సాయం అంటే పండుగ అని చాటి చెప్పారు. అందిరికి అన్నంపెట్టే అన్న‌దాత‌లు క‌ష్టాలు అర్ధం చేసుకున్న మోదీ.. రైత‌న్న‌లు పండించిన పంట‌ల‌కు మ‌ద్ధ‌తు ధ‌ర‌ పెంచి అన్న‌దాత‌ల‌కు ఆప‌ద్భాంధ‌వుడ‌య్యారు.  ప్ర‌ధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణ‌యం రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌ను నివారించ‌డంలో తోడ్ప‌డుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

నాలుగేళ్ల మోదీ పాలనలో దేశం అన్ని విధాలా అభివృద్ధి సాధించింది. ప్రపంచ య‌వ‌నికపై భారత కీర్తి పతాక రెపరెపలాడిన విషయాన్ని గుర్తించాలి. బిజెపి పాలనలో రాష్ట్రాలు అభివృద్ధికి దిక్సూచిగా మారాయి.  తెలంగాణలోనూ కాషాయదళానికి ఒక్క అవకాశమిస్తే… సత్తా చూపిస్తుంది.  తెలంగాణ కమలం జెండా ఎగురేస్తే.. బడుగు, బలహీన వర్గాలకు ఆశాదీపంగా బిజెపి నిలుస్తోంది. ప్రజలు  ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది…  నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలన… ఆరు దశాబ్దాల  కాంగ్రెస్ పాలనకు ఎంత మాత్రం భిన్నంగా లేదు.  వచ్చే ఎన్నికల్లో అక్రమాలు, కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడేలా ప్రజలను కార్యోణ్ముకులను చేయాలని మీ చెంతకు వచ్చాము.  జన చైతన్య యాత్రలో మీరంతా నాతో కలిసి వ‌చ్చిన‌ట్లుగానే.. తెలంగాణ వికాసానికి బిజెపికి మ‌ద్ధ‌తుగా మీ అడుగుల‌ను కొన‌సాగించండి.  మార్పు కోసం కలిసి నడుద్దాం. రండి.. బిజెపితో చేతులు క‌లిపి వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో క‌మ‌ల‌ద‌ళం విజ‌యాబావుటా ఎగుర‌వేసేందుకు  ఓ నిర్ణ‌యానికి వ‌చ్చి మ‌మ్మ‌ల్ని దీవించండి.

 

డాక్టర్ కె లక్ష్మణ్, బిజెపి తెలంగాణ అధ్యక్షులు

(తెలంగాణలో ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా… )

 

 

Click here to download PDF 

 

Did you find apk for android? You can find new Free Android Games and apps.